లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్ నీల్ ?

NTRNeel

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం ప్రశాంత్ నీల్ కసరత్తులు చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై యాక్షన్ సీన్స్ తో పాటు ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ పాత్రలో నటిస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండో పాత్ర తాలూకు సీన్స్ నే ఈ షెడ్యూల్ లో తీస్తారట. పైగా ఈ సీక్వెన్స్ కోసం ఎన్టీఆర్ కొత్త గెటప్ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది.

ఐతే, ‘డ్రాగన్‌’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version