‘విశ్వంభర’ షూట్ పై లేటెస్ట్ అప్డేట్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “విశ్వంభర”. భారీ ఫాంటసీ చిత్రంగా ప్లాన్ చేసిన ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ప్రశ్నార్ధకంగా మారింది. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసుకోలేదు.

అయితే షూటింగ్ దాదాపు అయిపోయింది, చిరు కూడా మరో సినిమాకి మూవ్ అయ్యిపోయారు. మరి లేటెస్ట్ గా సినిమా షూటింగ్ కోసం అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం ప్రస్తుతం మేకర్స్ ఓ ఐటెం నెంబర్ ని తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సాంగ్ కంప్లీట్ అయ్యాక షూటింగ్ అంతా అయిపోయినట్టే అని వినిపిస్తుంది. మరి ఆ కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనే దాని కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version