వాయిదాపడిన ‘గ్రీకువీరుడు’ విడుదల

వాయిదాపడిన ‘గ్రీకువీరుడు’ విడుదల

Published on Apr 8, 2013 3:03 PM IST

Greeku-Veerudu
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన సినిమా ‘ గ్రీకువీరుడు’. ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదల చేయాలని అనుకున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఏప్రిల్ 26న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగిసింది. అలాగే పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా త్వరలోముగియనున్నాయి. ఎస్.ఎస్ థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సంతోషం’ కి దర్శకత్వం వహీంచిన దశరద్ ఈ సినిమాకి డైరెక్టర్. కామాక్షి మూవీస్ బ్యానర్ పై శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు