మోహన్ లాల్ చేతుల మీదుగా మంచు విష్ణు చిత్ర ఆడియో విడుదల

మోహన్ లాల్ చేతుల మీదుగా మంచు విష్ణు చిత్ర ఆడియో విడుదల

Published on Oct 15, 2012 7:55 PM IST


విష్ణు మంచు తన రాబోతున్న చిత్రం “దేనికయినా రెడి” చిత్రం కోసం బాగా ప్రచారం చేస్తున్నారు పక్క రాష్ట్రాల్లో కూడా అయన మంచి ప్రచారం చెయ్యడం ఆసక్తి కరమయిన విషయం. ఈ చిత్ర చిత్రీకరణ గతవారం ముగియగానే విష్ణు బెంగుళూరులో ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించారు దానికి అతిధులుగా అంబరీష్ మరియు సుదీప్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం తరువాత విష్ణు కోచిన్ వెళ్ళారు అక్కడ “ఎందేనుం రెడీ” అనే పేరుతో విడుదలవుతున్న ఈ చిత్ర ఆడియోని మోహన్ లాల్ చేతుల మీదగా విడుదల చేశారు. మంచు విష్ణు చిత్రం మలయాళంలో విడుదల కావడం ఇదే తొలిసారి. ఈ ఎంటర్ టైనర్ చిత్రానికి జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మించారు. చక్రి మరియు యువన్ శంకర్ రాజ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు