ప్రారంభమైన సుమంత్ అశ్విన్ కొత్త సినిమా

ప్రారంభమైన సుమంత్ అశ్విన్ కొత్త సినిమా

Published on Mar 14, 2014 7:00 PM IST

sumanth-ashwin
‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాలో నటించిన సుమంత్ అశ్విన్ త్వరలో వేమారెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాలో నటించనున్నాడు. హైదరాబాద్ లో ఈ సినిమా ఈరోజు ప్రారంభమయ్యింది. దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సుకుమార్ క్లాప్ ని ఇచ్చారు. మొదటి షాట్ ను వి.వి వినాయక్ దర్శకత్వం వహించారు

ఈ సినిమా ఈతరం ప్రేమకధగా తెరకెక్కుతుంది. “వేమారెడ్డి, ప్రకాష్ నేను దర్శకులు కాకముందు ఒకే రూంలో వుండేవారం. మేము ఒక్కరమైనా కనీసం ఒక్క సినిమా అన్నా డైరెక్ట్ చెయ్యాలని కలగన్నాం. ఇప్పుడు వేమా రెడ్డి దర్శకుడిగా మారడం ఆనందంగా వుంది” అని సుకుమార్ తెలిపాడు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు

నరసింహా చారి, నరసింహా రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలు. సన్నీ సంగీత దర్శకుడు. సాయి శ్రీరాం సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు