“డమరుకం” విడుదల తేది ఖరారు?

“డమరుకం” విడుదల తేది ఖరారు?

Published on Jan 25, 2012 5:43 PM IST


కింగ్ నాగార్జున నటిస్తున్న భారి బడ్జట్ సోషియో ఫాంటసి చిత్రం “డమరుకం” ఏప్రిల్ 6 2012 న విడుదల కానున్నట్టు ఫిలిం నగర్ లో తాజా సమాచారం. ఆ రోజు “గుడ్ ఫ్రైడే” కావున ఆరోజు సెలవు దినం. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయ్యింది ప్రస్తుతం గ్రాఫిక్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం లో కొన్ని ప్రత్యేక సిజిఐ మరియు స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ ఉండబోతున్నాయి.

ఈ చిత్రం లో ఇవే ప్రధాన ఆకర్షణ కాబోతున్నాయి అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మోవీ మేకర్స్ బ్యానర్ మీద డా.వెంకట్ నిర్మిస్తున్నారు. శ్రీనివాస రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ వ్యయం 30కోట్లకు పైగా ఉండబోతుంది. ఈ చిత్రం లో అనుష్క కథానాయికగా చేస్తున్నారు.

తాజా వార్తలు