స్పృహ తప్పి పడిపోయిన ప్రియాంక చోప్రా

స్పృహ తప్పి పడిపోయిన ప్రియాంక చోప్రా

Published on Jan 10, 2012 1:53 PM IST

బాలీవుడ్ బ్యూటీ మరియు ప్రస్తుత తరం హీరోయిన్లలో బిజీ షెడ్యుల్ తో ఉండే ప్రియాంక చోప్రా స్పృహతప్పి పడిపోయారు. ఇటీవల ముంబైలో జరిగిన పోలీసు వార్షిక వేడుకల్లో ప్రియాంక చోప్రా ప్రదర్శన ఉండగా ఆమె మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయారు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన నిర్వాహకులు వెంటనే ఆమె పర్సనల్ వ్యాన్ కి తరలించి చికిత్స చేసారు.

రక్తపోటు పడిపోవడం వల్ల ఆమె అనారోగ్యానికి గురైనట్లు డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ బిజీ షెడ్యుల్ మరియు సమయానికి తగ్గట్లు సరైన ఆహరం తీసుకోకపోవడం వలన తారలు ఇలా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ప్రియాంక చోప్రా గతంలో 2009 లో అశోతోష్ గోవారికర్ డైరెక్షన్లో వచ్చిన ‘వాట్స్ యువర్ రాశీ’ చిత్ర షూటింగ్ సమయంలో కూడా ఇలాగె స్పృహ తప్పి పడిపోయారు. ప్రియాంక త్వరగా కోలుకవాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు