మే లో విడుదలకానున్న పిల్లా నువ్వు లేని జీవితం

మే లో విడుదలకానున్న పిల్లా నువ్వు లేని జీవితం

Published on Mar 16, 2014 2:30 AM IST

sai-dharam-tej
సాయి ధరమ్ తేజ్, రేజీనా లు జంటగా నటిస్తున్న ‘పిల్లా నువ్వు లేని జీవితం’ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. హైదరాబాద్ లో ఈ సినిమా కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటుంది. క్లైమాక్స్ కూడా పూర్తి చేసేస్తే సినిమా షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయచ్చు. క్లైమాక్స్ ను ముందుగా వేరే రాష్ట్రంలో తీద్దాం అనుకున్నా చివరికి హైదరాబాద్ లోనే తీయవలిసివచ్చింది.

ఏ .ఎస్ రవి కుమార్ చౌదరి దర్శకుడు. బన్నీ వాస్, హర్షిత్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్, ఎస్.వి.సి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సమర్పకుడు. ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన జగపతిబాబు నటన అందరినీ ఆకట్టుకోనుందని సమాచారం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకుంటున్న విధానంపై అందరూ ఆనందంగా వున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను మే 2వ వారంలో మనముందుకు తీసుకురానున్నారు.

తాజా వార్తలు