కొన్ని రోజుల నుంచి ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం నాగార్జున, ఎన్.టీ.ఆర్ తో కలసి వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ఒక మల్టీ స్టారర్ చిత్రం లో నటించనున్నారు అన్న వార్త తిరుగుతుంది.
ఈ సమాచారం అందరిని ఎంతో సంతోష పరిచింది ఎందుకంటే ఎన్.టీ.ఆర్ – నాగార్జునలది ఒక ఇంటరెస్టింగ్ కాంబినేషన్ అవనుంది. అయితే ఈ చిత్రం ఏప్రిల్ 15 న మొదలు కానుంది అనే వార్త వచ్చింది . కాని ఆ వార్త వట్టి పుకారేనని మేము తెలుసుకున్నాం. ప్రొడక్షన్ హౌస్ స్టేజ్ లో వున్న ఈ చిత్రం షూటింగ్ ప్లాన్స్ మొదలుపెట్టడానికి ఇంకా చాలా సమయం వుంది. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ దశ లో వున్న ఈ చిత్రం ఒక రూపు కి ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.
ప్రస్తుతం నాగార్జున వేసవి లో విడుదల కానున్న ‘మనం’ పోస్ట్ ప్రొడక్షన్ పని లో బిజీ గా వున్నారు. అలాగే ఎన్.టీ.ఆర్ ‘రభస’ చివరి షెడ్యూల్ కూడా త్వరలో మొదలు కానుంది.