కే బాలచందర్ కమల్ హాసన్ ను తమిళ సినిమాలో స్టార్ గా నిలబెడితే తెలుగులో ఆ అవకాశం కళాతపస్వి కే. విశ్వనాద్ గారికి దక్కింది. వీరి కలయికలో వచ్చిన సాగరసంగమం, స్వాతి ముత్యం సినిమాలు 80వ దశకంలో బ్లాక్ బస్టర్ లు గా నిలిచాయి. శుభసంకల్పం, కురుతిపూనల్, అబ్నే శివం వంటి సినిమాలో కమల్ తో కలిపి స్క్రీన్ ని కూడా షేర్ చేస్కున్నారు.
ఇప్పుడు దాదాపు 11సంవత్సరాల తరువాత వీరి కలయికలో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాను విశ్వనాద్ గారు డైరెక్ట్ చెయ్యట్లేదు. కమల్ నటించిన ఉత్తమ విలన్ సినిమాలో ఒక ముఖ్య పాత్ర వేయమని కమల్ ఈయనను కోరడంతో మన కళాతపస్వి అంగీకరించారట. విశ్వనాద్ కమల్ కు మామయ్యగా కనిపించనున్నారు. 8వ శతాబ్దంతో చిత్రీకరించే సన్నివేశాలలో కే విశ్వనాద్ గారు కనిపించనున్నారు
ఈ ఉత్తమ విలన్ సినిమాలో ఊర్వశి, పార్వతీ మీనన్, ఆండ్రియా మరియు పూజా కుమార్ లు నటిస్తున్నారు. రమేష్ అరవింద్ దర్శకుడు. ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు వున్నాయి