అంత సీన్ లేదు సినిమాకు యు/ఏ

అంత సీన్ లేదు సినిమాకు యు/ఏ

Published on Mar 13, 2014 11:35 PM IST

Antha-Scene-Ledu
నవదీప్, శశాంక్ ల ద్వయం త్వరలో ‘అంత సీన్ లేదు’ అనే కామెడి థ్రిల్లర్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకు వెంకట్ కాచర్ల దర్శకుడు. చక్రవర్తి రామచంద్ర, రెహ్నా మల్హోత్రా, అంకిత మహేశ్వరీ ఈ సినిమా ద్వారా పరిచయంకానున్నారు

ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తిచేసుకుని యు/ఏ సర్టిఫికేట్ సంపాదించుకుంది. ఈ సినిమా నిడివి 108నిముషాలే కావడం విశేషం. సినిమా మొత్తం ఒక రాత్రిలోనే జరుగుతుంది గనుక లైట్, సౌండ్ లను పరిగణంలోకి తీసుకుని రాత్రివేళల్లో ఎక్కువ షూటింగ్ చేసారు. నిడివి తక్కువ సమయం గనుక ఈ సినిమాను చూపించే విధానం, సినిమాలో కధను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుందని దర్శకుడు తెలిపాడు

కల్యాణి కోడూరి నేపధ్య సంగీతం అందించారు. మిట్చ్ సినిమాటోగ్రాఫర్. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్. త్వరలో ఈ చిత్రం విడుదలకానుంది

తాజా వార్తలు