చడీ చప్పుడు లేకుండా విడుదలకానున్న రాజా రాణి

చడీ చప్పుడు లేకుండా విడుదలకానున్న రాజా రాణి

Published on Mar 13, 2014 10:10 PM IST

Raja-Rani1
తమిళనాడులో మంచి విజయం సాధించిన ‘రాజా రాణి’ సినిమా తెలుగులో ఈ శుక్రవారం విడుదలకానుంది. అక్కడ ఘన విజయం సాధించినా ఇక్కడ ఈ సినిమాకు అసల గుర్తింపే లేదని చెప్పాలి. ఇక్కడి పంపిణీదారుల ప్రచారలోపం వలన ఇలాంటి ఒక సినిమా విడుదలవుతుందనే చాలామందికి తెలియదు

ఆర్య, నయనతార లు ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో జంటగా నటిస్తున్నారు. నజ్రియా మరియు సత్య రాజ్ ముఖ్యపాత్రధారులు. అత్లీ కుమార్ దర్శకుడు. మురగదాస్ నిర్మాత

ఈ సినిమాలో విషయం వుంది కాబట్టి పెద్ద ప్రచారం లేకపోయినా రేపు విడుదలకానున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆశిద్దాం

తాజా వార్తలు