పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభంజనంగా మారుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను మెగా అభిమానుల్లో ఒక పక్క ఆనందాన్ని, మరోపక్క గందరగొలన్ని కలిగిస్తోంది. ఇప్పటి వరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విబేధాలు ఉన్నాయనే పుకార్లు మాత్రమే అభిమానుల్లో వున్నాయి. కానీ ప్రస్తుత పరిణామాలతో అవి తోలిగిపోయినట్టు అయ్యింది. ఈ విషయంలో ఇప్పటి వరకు నాగాబాబు తటస్థంగా ఉన్నాడు. కానీ ఆయన ఈ రోజు తన ఎవరికి విదేయుడిగా ఉన్నడో స్పష్టంగా ఒక వీడియోలో రికార్డ్ చేసి విడుదల చేశాడు. దానిలో ‘ చిరంజీవి మా అన్నయ్య. ఆయన ఎన్ని కష్ట నష్టాలను భరించి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నదో నాకు బాగా తెలుసు. అభిమానల్లో ఆయనకున్న స్థానం ఎంతో గొప్పది. మేమంతా అన్నయ్య చిరంజీవి గారి వెనకే ఉన్నాం’ అని అన్నాడు.
నాగబాబు ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ భారీ చర్చకు దారి తీసింది. ఇప్పుడు మెగా అభిమానులు సంగిగ్దంలో పడ్డారు. తాము ఎవరి వైపు నిలబడాలి ? చిరంజీవి వైపునా ? లేక పవన్ కళ్యాణ్ వైపునా ? అని ఆలోచిస్తున్నారు. రాజకీయ నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ రేపు ఏం మాట్లాడుతాడా అని వేచి చూస్తున్నాయి. ఇప్పుడు అందరిని వేదిస్తున్న ప్రశ్నలన్నిటికి పవన్ మాత్రమే సమాదానం చెప్పగలరు.