ఈమధ్య తెరవెనుక పాత్రలు పడే కష్టాన్ని తెరపై చూపించడం కొత్త ట్రెండ్ అయింది. సినిమా చివర్లో నవ్వుకోవడానికి మేకింగ్ వీడియోలు చూపించినా ఒక సన్నివేశాన్ని సెట్ పై చిత్రీకరించడం ఎంత కష్టమో ఎవరూ చెప్పలేదు. కాకపోతే అటువంటి సాహసాన్ని మేకింగ్ వీడియో రూపంలో రాజమౌళి మనముందుకు తెచ్చాడు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని గుణశేఖర్ ఫాలో అవుతున్నాడు
నవంబర్ లో విడుదలచేసిన రుద్రమదేవి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూడగానే మనకు ముందు స్మరించేది అనుష్క ధరించిన కిరీటం. ఈరోజు ‘క్రౌన్ ఎఫైర్’ పేరిట ఆ కీరీటం రూపొందించిన తీరును మేకింగ్ వీడియో రూపంలో చూపించారు. రాణి రుద్రమదేవి జీవితకధ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనుష్క ప్రధాన భూమిక పోషిస్తున్న విషయం మనకు తెలిసినదే. 3డి లో తీస్తున్న ఈ సినిమాలో రానా, నిత్యా మీనన్, కేథరీన్ త్రేస, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజాలు నటిస్తున్నారు
ఇళయరాజా సంగీత దర్శకుడు. తోట తరుణి ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమా ఈ యేడాదిలోనే మనముందుకు రానుంది