బిజీ బిజీగా గడుపుతున్న శృతి హాసన్

బిజీ బిజీగా గడుపుతున్న శృతి హాసన్

Published on Feb 4, 2014 5:56 PM IST

Shruthi-hasan
కెరీర్ ప్రారంభం అంత గొప్పగా లేకపోయినా ‘గబ్బర్ సింగ్’ లో చేసిన శృతి హాసన్ చేసిన భాగ్యలక్ష్మి పాత్ర తనని ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ లిస్టులో చేర్చింది. గత సంవత్సరం బలుపు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శృతి హాసన్ ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు, టాలీవుడ్ లో ఓ సినిమా, కోలీవుడ్ లో ఓ సినిమా చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతూ ఉంది.

న్యూ ఇయర్ సందర్భంగా రెండు రోజులు గ్యాప్ తీసుకున్న శృతి హాసన్ ఆ తర్వాత నుంచి నాన్ స్టాప్ గా ప్రతి రోజూ షూటింగ్ లో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన చేస్తున్న గబ్బర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ భామ త్వరలోనే ‘రేసు గుర్రం’ సినిమా షూటింగ్ లో పాల్గొననుంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు