బాహుబలికి మ్యాజిక్ గా మారనున్న సాబు సైరిల్ వర్క్

బాహుబలికి మ్యాజిక్ గా మారనున్న సాబు సైరిల్ వర్క్

Published on Feb 2, 2014 4:00 AM IST

bahubali-team
నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సబు సైరిల్ చాలా భారీ బడ్జెట్ సినిమాలైన ‘అశోక’, ‘రోబో’, ‘ఓం శాంతి ఓం’, ‘కాలాపానీ’ లాంటి సినిమాలకు పనిచేసాడు. ప్రస్తుతం ఆయన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘బాహుబలి’ కోసం పనిచేస్తున్నారు.

సబు సైరిల్ మరియు అతని టీం ఈ సినిమా కోసం పురాతనమైన కొన్ని సెట్స్ ని బాగా డీటైల్ గా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. అలాగే ఈ టీం సినిమా కోసం కొన్ని ఆయుధాలను, రథాలను, కాస్ట్యూమ్స్ ని కూడా డిజైన్ చేస్తున్నారు.

ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

తాజా వార్తలు