ఎ.ఎన్.ఆర్ చివరి స్పీచ్ రిలీజ్ చేసే ఆలోచనలో నాగార్జున

ఎ.ఎన్.ఆర్ చివరి స్పీచ్ రిలీజ్ చేసే ఆలోచనలో నాగార్జున

Published on Jan 30, 2014 1:45 PM IST

Nagarjuna
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళలో ఒకరైన అక్కినేని నాగేశ్వర రావు ఇటీవలే స్వర్గస్తులైనారు. ఆయన చివరిగా నటించిన సినిమా ‘మనం’. మార్చి 31న రిలీజ్ కానున్న ఈ సినిమా నాగార్జున ఎ.ఎన్.ఆర్ కి ఘనమైన వీడ్కోలుగా నిలిచిపోతుందని ఆశిస్తున్నారు. అలాగే ఎ.ఎన్.ఆర్ 90 వ పుట్టిన రోజు సందర్భంగా తన కుటుంబ సమక్షంలో ఆయన ప్రసంగించిన ఓ వీడియో ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారు.

దాని గురించి నాగార్జున మాటల్లోనే ‘ ఇలా జరుగుతుందని నాన్నగారు ముందే ఊహించినట్లున్నారు. అందుకే తన 90 వ పుట్టిన రోజుకి దేశ విదేశాల్లో ఉన్న తన మిత్రులను, కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాలని అందరిని ఆహ్వానించాడు. దాదాపు 2000 మంది వచ్చారు, వారి కోసం 200 టేబుల్స్ వేసాము. నాన్నగారు ప్రతి టేబుల్ దగరికి వెళ్లి అందరితో మాట్లాడారు. ఆ సందర్భంలో ఆయన ఓ గంటపాటు తన లైఫ్ జర్నీ ఎలా సాగింది అనే విషయంపై మాట్లాడారు. లక్కీ ఏంటంటే ఆ స్పీచ్ ని మేము రికార్డ్ చేసాం. దీనిని అందరికి అందిచాలనే ఆలోచనలో ఉన్నామని’ నాగార్జున అన్నాడు.

ఈ వీడియోని రిలీజ్ చేస్తే చూడాలని, ఎ.ఎన్.ఆర్ చివరి స్పీచ్ వినాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు