సౌత్ ఇండియాలో భారీ తనంతో, భారీ సెట్స్ తో ప్రేక్షకులను అబ్బురపరిచేలా సినిమాలు తీస్తాడు అని పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శంకర్. శంకర్ ప్రస్తుతం ‘ఐ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదే సినిమా తెలుగులో మనోహరుడు గా ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందు రానున్న ఈ సినిమా కోసం శంకర్ భారీగా ప్లాన్స్ చేస్తున్నారు. సుమారు 3 గంటల నిడివి గల మేకింగ్ వీడియోని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ వీడియోలో విక్రమ్ పలు గెటప్స్ కి సంబందించిన మేకప్ మరియు సినిమా కోసం వేసిన భారీ సెట్స్ మేకింగ్ గురించి చూపించనున్నారు. గతంలో కూడా శంకర్ శివాజీ, రోబో, నన్బన్ సినిమాలకు ఇలానే మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేయడంతో ప్రచారం బాగా జరిగింది. అందువలన శంకర్ ఈ సారి కూడా ఇలా ప్లాన్ చేస్తున్నాడు.
సురేష్ గోపి, రామ్ కుమార్, ఉపెన్ పటేల్, సంతానం కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్నాడు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీకి పిసి శ్రీ రామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.