మార్చి చివర్లో రానున్న కొత్త జంట

మార్చి చివర్లో రానున్న కొత్త జంట

Published on Jan 29, 2014 12:40 PM IST

Kottha-Janta
‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ సినిమాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి చేస్తున్న మూడవ సినిమా ‘కొత్త జంట’. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ముందుగా లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. అనుకోకుండా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడం వాళ్ళ ఈ సినిమా విడుదల వాయిదా వేసారని సమాచారం. అలాగే మార్చి చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అటు అమలాపురం’ పాటని రీమిక్స్ చేస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ పాట మేకింగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకి జెబి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు