ఆహా కళ్యాణం తరువాత నేను ఇరకాటంలో పడతాను: నాని

ఆహా కళ్యాణం తరువాత నేను ఇరకాటంలో పడతాను: నాని

Published on Jan 29, 2014 4:14 AM IST

Nani
నాని కెరీర్ లోనే ఇది పతాక సమయం అని చెప్పచ్చు. అతను నటించిన మూడు విభిన్న సినిమాలు ఫిబ్రవరిలోనే విడుదలకానున్నాయి. అందులో ముందుగా ఫిబ్రవరి 7న కృష్ణవంశీ పైసా తరువాత జెండా పై కపిరాజు, చివరిగా ఆహా కళ్యాణం విడుదలకానున్నాయి

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఆహా కళ్యాణం ఆడియో విడుదల వేడుకలో నాని మాట్లాడుతూ “ఈ సినిమా షూటింగ్ మొత్తం ఒక పిక్నిక్ లా జరిగింది. ఇటీవల కాలంలో నేను ఏ సినిమాను ఇంత ఎంజాయ్ చేయలేదు. నేను ఈ సినిమాను అంగీకరించి పెద్ద రిస్క్ చేశానని చెప్పాలి. అంతేకాక ఈ సినిమా విడుదలయ్యాక నేను ఇరకాటంలో పడతాను. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో స్క్రిప్ట్ డిమాండ్ ను బట్టి దర్శకుడు చెప్పింది చెప్పినట్టు గుడ్డిగా చేసుకుంటూ పోయాను” అని చెప్పగానే అందరూ చిరునవ్వును చిందించారు. విషయం ఏమిటో స్పష్టంగా చెప్పకపోయినా నాని, వాణి నటించిన కిస్సింగ్ సీన్ గురించే అని ఈజీగా అర్ధమవుతుంది. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ అయిన బ్యాండ్ భాజా భారత్ లో ఎక్కువ చర్చలకు గురైన సన్నివేశం ఇదే

గోకుల్ కృష్ణ దర్శకుడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. ధరన్ కుమార్ సంగీతదర్శకుడు

తాజా వార్తలు