తన సినిమాలతో ప్రేక్షకులను ఆద్యంత నవ్వించడమే కామెడీ కింగ్ అల్లరి నరేష్ పని. దాని కోసం తను పలు గెటప్స్ మారుస్తుంటాడు మరియు పలు రకాల పాత్రల్లో కనిపించి నవ్విస్తుంటాడు. ఈ సారి అల్లరి నరేష్ ద్విపాత్రాభినయంతో నవ్వించడానికి చేస్తున్న సినిమా ‘జంప్ జిలానీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అక్కడ ఈ సినిమా కోసం వేసిన ఓ పోలీస్ స్టేషన్ సెట్లో కొన్ని కామీడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇ. సత్తిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అంబికా కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘కలకలప్పు’ సినిమాకి రీమేక్. ఇది కాకుండా అల్లరి నరేష్ నటించిన ‘లడ్డూబాబు’ సినిమా విడుదలకి సిద్దంగా ఉంది. రవిబాబు ఈ సినిమాకి డైరెక్టర్.