పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో తన పాత్ర గురించి చాలా విషయాలు చెప్పుకొస్తుంది. దూసుకెళ్తా సినిమాలో వీరు నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. మోహన్ బాబు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, రవీనా టాండన్ మరియు ప్రణీత సుభాసిష్ నటించారు
ఈ సినిమా గురించి హన్సిక మాట్లాడుతూ “నేను ఈ సినిమాలో టామ్ బాయ్ రోల్ చేస్తున్నా. విష్ణుతో ప్రేమలో పడతాను. బయటకూడా విష్ణు నాకు మంచి స్నేహితుడు. అంతపెద్ద తారాగణంతో చెయ్యడం నాకు ఆనందంగా వుంది. ముఖ్యంగా మోహన్ బాబు గారితో నటించడం నా అదృష్టం. నేను ఆయన దగ్గరనుండి చాలా నేర్చుకున్నా”అని తెలిపింది. మోహన్ బాబు టూరిస్ట్ గైడ్ కింద చేస్తున్నాడు. మనోజ్ లేడీ గెట్ అప్ లో అలరించనున్నాడు.
అచ్చు, చక్రి, బప్పా లహరి సంగీత దర్శకులు. విష్ణు, మనోజ్ నిర్మాతలు. ఈ సినిమా జనవరి 31న విడుదలకానుంది