నేడు రెహ్మాన్ పుట్టినరోజు

నేడు రెహ్మాన్ పుట్టినరోజు

Published on Jan 6, 2012 12:51 PM IST


ఆస్కార్ విజేత మద్రాస్ మొజార్ట్ ఈ రోజుతో 46 వసంతాలు పూర్తి చేసుకున్నారు. 6 జనవరి 1966 లో ఎ.ఎస్. దిలీప్ కుమార్ గా సంగీతానికి సంబంధించిన కుటుంబంలో జన్మించిన ఆయన తొలిరోజుల్లో సాధారణ జీవితం గడిపారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ దగగ్గర పనిచేసారు. తొలి రోజుల్లో ఇళయరాజా గారి దగ్గర మరియు కోటి దగ్గర అసిస్టెంట్ వెస్ట్రన్ మ్యూజిక్ లో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు ఆయన.

1889 లో తన సోదరికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెహ్మాన్ గా పేరు మార్చుకోమని సలహా ఇవ్వడంతో రెహ్మాన్ గా మార్చుకున్నారు. మొదట్లో పలు వాణిజ్య కార్యక్రమాలకు సంగీతం అందించిన రెహ్మాన్ మని రత్నం 1992 లో తీసిన ‘రోజా’ చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. మొదటి చిత్రంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రెహ్మాన్ ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మణిరత్నం వంటి ప్రముఖ దర్శకులతో పనిచేసి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రంతో ఆస్కార్ అవార్డు అందుకున్నారు రెహ్మాన్. ఇండియన్ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళారు.

123తెలుగు.కామ్ తరపున మ్యూజికల్ మేస్ట్రో జన్మదిన శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు