డబ్బింగ్ పనుల్లో ఉలవచారు బిర్యాని

డబ్బింగ్ పనుల్లో ఉలవచారు బిర్యాని

Published on Jan 27, 2014 1:00 PM IST

Ulava-Charu-Biryani-Movie
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మూడు భాషల్లో చేస్తున్న ‘ఉలవచారు బిర్యాని’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయా స్టూడియోస్ లో జరుగుతున్నాయి. డబ్బింగ్ పనులను స్వయంగా ప్రకాష్ రాజ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర చేయడమే కాకుండా డైరెక్టర్ మరియు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టాడు.

ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘సాల్ట్ n పెప్పర్’ సినిమాకి రీమేక్. ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియో మార్చ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్, స్నేహ, సంయుక్త, ఊర్వశి ప్రధాన ప్రాత్రాల్లో నటించిన ఈ ‘ఉలవచారు బిర్యాని’ ని 2014 సమ్మర్లో ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు