తెలుగువారి సాంప్రదాయ థీమ్ తో రానున్న ఆహా కళ్యాణం

తెలుగువారి సాంప్రదాయ థీమ్ తో రానున్న ఆహా కళ్యాణం

Published on Jan 27, 2014 8:53 AM IST

Aaha-Kalyanam
యంగ్ హీరో నాని నటించిన ‘ఆహా కళ్యాణం’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ రోజు సాయంత్రం నవోటల్ లో జరగనుంది. లెజండ్రీ ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమం తెలుగు సాంప్రదాయబద్దమైన థీమ్ తో జరగనుంది. ఈ వేడుకకి ఈ చిత్ర టీం మొత్తం తెలుగు సాంప్రదాయబద్దమైన దుస్తులలో వచ్చి ఆకట్టుకోనున్నారు.

వాణి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘బ్యాండ్ బాజా బారత్’ సినిమాకి రీమేక్. గోకుల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ఆదిత్య చోప్రా డైరెక్టర్. ధరన్ కుమార్ మ్యూజిక్ అందినచిన ఈ సినిమా ఫిబ్రవరి చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు