బాపు అధ్బుత సృష్టి ‘శ్రీ రామరాజ్యం’ నేటితో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ వేడుకను శిల్ప కళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా ఈ వేడుకకు బాలయ్య బాబు, నయనతార, దర్శకరత్న దాసరి నారాయణ రావు, ఈ చిత్ర దర్శకుడు బాపు, కళా తపస్వి కె.విశ్వనాధ్, కె.రాఘవేంద్ర రావు, మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు, ప్రసాద్ లాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, కృష్ణం రాజు మ్యూజిక్ మేస్ట్రో ఇలయరాజా, ఎస్.పి.బాలు, శ్రీకాంత్, మురళి మోహన్, తనికెళ్ళ భరణి, ఈ చిత్ర నిర్మాత సాయి బాబు మొదలగు వారు ఈ వేడుకకు హాజరయ్యారు. బాలయ్య బాబు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులపై నమ్మకంతో ఈ చిత్రం మొదలు పెట్టారనీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టరాని అన్నారు. దాసరి నారాయణ రావు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు 40 ఏళ్ళ వయసులో లవకుశ చేసారు, బాలయ్య 50 ఏళ్ళ వయస్సులో శ్రీ రామరాజ్యం చేయగలిగారని అన్నారు. ఎన్నో ఏళ్ళకి గానీ ఇలాంటి చిత్రాలు రావని ఇటువంటి చిత్రాలను ఆదరించాలని కోరారు. ఎస్.పి.బాలు మాట్లాడుతూ నయనతార తన కెరీర్లో మళ్లీ ఇలాంటి సినిమా రాదు అనీ, వచ్చినా ఇంత అధ్బుతంగా చేయలేవని కొనియాడారు. నిర్మాత సాయి బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!