బాపు అధ్బుత సృష్టి ‘శ్రీ రామరాజ్యం’ నేటితో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ వేడుకను శిల్ప కళా వేదికలో జరిగింది. ఈ సందర్భంగా ఈ వేడుకకు బాలయ్య బాబు, నయనతార, దర్శకరత్న దాసరి నారాయణ రావు, ఈ చిత్ర దర్శకుడు బాపు, కళా తపస్వి కె.విశ్వనాధ్, కె.రాఘవేంద్ర రావు, మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడు, ప్రసాద్ లాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్, కృష్ణం రాజు మ్యూజిక్ మేస్ట్రో ఇలయరాజా, ఎస్.పి.బాలు, శ్రీకాంత్, మురళి మోహన్, తనికెళ్ళ భరణి, ఈ చిత్ర నిర్మాత సాయి బాబు మొదలగు వారు ఈ వేడుకకు హాజరయ్యారు. బాలయ్య బాబు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులపై నమ్మకంతో ఈ చిత్రం మొదలు పెట్టారనీ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టరాని అన్నారు. దాసరి నారాయణ రావు గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు 40 ఏళ్ళ వయసులో లవకుశ చేసారు, బాలయ్య 50 ఏళ్ళ వయస్సులో శ్రీ రామరాజ్యం చేయగలిగారని అన్నారు. ఎన్నో ఏళ్ళకి గానీ ఇలాంటి చిత్రాలు రావని ఇటువంటి చిత్రాలను ఆదరించాలని కోరారు. ఎస్.పి.బాలు మాట్లాడుతూ నయనతార తన కెరీర్లో మళ్లీ ఇలాంటి సినిమా రాదు అనీ, వచ్చినా ఇంత అధ్బుతంగా చేయలేవని కొనియాడారు. నిర్మాత సాయి బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
బాపు మలిచిన అధ్బుత దృశ్యకావ్యం శ్రీ రామరాజ్యం
బాపు మలిచిన అధ్బుత దృశ్యకావ్యం శ్రీ రామరాజ్యం
Published on Jan 5, 2012 11:00 PM IST
సంబంధిత సమాచారం
- అఫీషియల్: సూర్య తెలుగు సినిమాలో కేజీయఫ్ నటి
- ఓటీటీలో కూడా ‘ఓజి’ ఊచకోత!
- పట్టాలెక్కేందుకు ‘స్పిరిట్’ రెడి!
- విక్రమ్ కొడుక్కి తెలుగు ఆడియెన్స్ మంచి వెల్కమ్
- ఓటీటీ లోకి వచ్చాక “ఓజి” కి ఊహించని రెస్పాన్స్!
- అది ఒక అద్భుతమైన వేదిక – ప్రియమణి
- యంగ్ హీరోతో సీనియర్ దర్శకుడు ఫిక్స్ !
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో స్పెషల్ ఎపిసోడ్
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ధృవ్ విక్రమ్ ‘బైసన్’ – కొంతవరకే వర్కవుట్ అయిన స్పోర్ట్స్ డ్రామా
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ స్టార్ తో ‘కే ర్యాంప్’ హీరో
- ఓటీటీ సమీక్ష: ‘కురుక్షేత్ర’ సీజన్ 2 – తెలుగు డబ్ యానిమేటెడ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘మాస్ జాతర’ ట్రైలర్ ఫీస్ట్ కి డేట్ వచ్చేసింది!
- ముందస్తు బుకింగ్ లో అదరగొట్టిన ‘బాహుబలి ది ఎపిక్’ !
- ఫౌజీ పై ఇంట్రెస్టింగ్ బజ్.. నిజమైతే ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం!
- ‘శంకర వరప్రసాద్ గారు’తో మెగాస్టార్ ఆ ఫీట్ కొడతారా..?
- ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !


