ఫిబ్రవరిలో బాలకృష్ణ ‘లెజెండ్’ ఆడియో

ఫిబ్రవరిలో బాలకృష్ణ ‘లెజెండ్’ ఆడియో

Published on Jan 15, 2014 5:14 PM IST

Legend_First_Look1

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా ‘ లెజెండ్’. ఈ సినిమా ఆడియోని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దేవీ శ్రీ మొదటి సారిగా బాలకృష్ణ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ పై మూవీ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్ త్వరలో విడదల కావచ్చు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గత సినిమా ‘సింహ’ లా హిట్ ను సాదిస్తుందని బావిస్తున్నారు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు విలన్ గా కనిపించనున్నాడు.14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలన చిత్రం కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు