సుకుమార్ ని ఇంటర్వ్యూ చేసిన రాజమౌళి

సుకుమార్ ని ఇంటర్వ్యూ చేసిన రాజమౌళి

Published on Jan 15, 2014 8:30 AM IST

RAJMOULISUKUMAR

మాములుగా పర్సనల్ లేదా టీవీ చానల్స్ కోసం సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చెయ్యాలి అంటే యాంకర్స్ చేస్తారు. చాలా అరుదుగా ఒక సెలబ్రిటీ మరో సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోలు బాగా ఫేమస్ కూడా అవుతాయి. అలాంటిదే ఈ సంక్రాంతి రోజున ఒకటి జరగనుంది. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ ని ఇంటర్వ్యూ చేసారు. ఈ షో ఈ రోజు మా టీవీ లో ప్రసారం అవుతుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి ‘1-నేనొక్కడినే’ సినిమా గురించి, సినిమాలోని బెస్ట్ పార్ట్స్ గురించి మాట్లాడనున్నారు.

ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబుకి ఉన్న సూపర్బ్ మార్కెట్ వల్ల యూస్ లో మంచి వసూళ్లను సాధించింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి.

తాజా వార్తలు