ఫిబ్రవరి లో శేఖర్ కమ్ముల అనామిక సినిమా నిమ్మదిగా ఊపందుకుంటుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా బృందం వినూత్న పంధాలను ఎంచుకుంటుంది.
సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేవి గాలిపటాలు కాబట్టి కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో వెరైటీ గాలిపటాలు ఎగురవేశారు. వాటిమీద “అజయ్ శాస్త్రి ఈజ్ మిస్సింగ్” అని రాశి వుంచారు. మరి తన భార్య తప్పిపోయిన అజయ్ ను కనుక్కుంటుందా అనేది తెరపై చూడాలట
ఈ సినిమా విద్యాబాలన్ నటించిన కహానీ కి రీమేక్. ఇక్కడ ఆ పాత్రను నయనతార పోషించింది. సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆమె పేరు అనామిక శాస్త్రి. హర్షవర్ధన్ రానే, వైభవ్ రెడ్డి ప్రధాన పాత్రధారులు. కీరవాణి సంగీతదర్శకుడు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు