ఆ రెండు విషయాలు చరణ్ నుంచి నేర్చుకోవాలి – అల్లు అర్జున్

ఆ రెండు విషయాలు చరణ్ నుంచి నేర్చుకోవాలి – అల్లు అర్జున్

Published on Jan 14, 2014 4:41 PM IST

allu-arjun-ram-charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ఎవడు’ సినిమా ఆదివారం, ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ ప్రముఖ పాత్రలో నటించాడు. అల్లు అర్జున్ కి డాన్స్ ల విషయంలో ప్రత్యేక గుర్తింపు ఉంది అలాగే రామ్ చరణ్ కి కూడా డాన్సులలో ఓ స్పెషాలిటీ ఉంది.

తాజాగా ఇద్దరూ కలిసి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీ ఇద్దర్లో ఎవరు బెస్ట్ డాన్సర్ అని అడిగితే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు అసలు నిజం ఏంటని అడిగితే అల్లు అర్జున్ సమాధానమిస్తూ ‘ ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. నేను తన స్టైల్లో చెయ్యలేను, తను నా స్టైల్లో చెయ్యలేడు. ఓవరాల్ గా నాకంటే చరణ్ మంచి డాన్సర్.. తన నుంచి రెండు విషయాలు నెర్చుకుకొవాలి. ఒకటి మూమెంట్స్ చలా షార్ప్ గా కట్ చేస్తాడు, రెండవది డాన్స్ చేసేప్పుడు పేస్ చాలా బాగుండాది నేనైతే స్టెప్ వెయ్యాలనే టెన్షన్ లో అంత పర్ఫెక్ట్ గా పేస్ పెట్టను, ఈ రెండు తన నుంచి నేర్చుకోవాలని కొరియోగ్రాఫర్ తో కూడా అన్నానని’ అన్నాడు.

వంశీ పైడిపల్లి నిర్మించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

తాజా వార్తలు