మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా విడుదలకు ముందే కావల్సినంత హైప్ ని సంపాదించుకుంది. ఈ సినిమా అమెరికాలో మరియు ఇక్కడ ‘ఏ’ సెంటర్ల, మల్టీప్లెక్స్ ల ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాక అంతర్జాలంలో ఈ సినిమాపై కావల్సినంత చర్చ జరుగుతుంది. తెలుగు సినిమాకు సంబంధించిన దర్శకులు, నటులు స్వయంగా సినిమా గొప్పతనాన్ని వైభవంగా చెప్తున్నారు
ఇప్పుడు సినిమా విడుదల అనంతరం మహేష్ బాబు ఈ సినిమా గురించి ట్విటర్ లో స్పందించాడు ” ‘1’ నా జీవితంలో నటించిన మరుపురాని సినిమాలలో ఒకటి. సుకుమార్ కు తలవంచి నమస్కరిస్తున్నా. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీఒక్కరికీ నా కృతజ్ఞతలు.” అని తెలిపాడు. ఈ సినిమాలో మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు పొందారు. సుకుమార్ దర్శకుడు. కృతిసనన్ హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. రత్నవేలు సినిమాటోగ్రాఫర్. 14రీల్స్ సంస్థ నిర్మాత