ముగ్గురు భామలతో ఆడిపాడనున్న సందీప్ కిషన్

ముగ్గురు భామలతో ఆడిపాడనున్న సందీప్ కిషన్

Published on Jan 13, 2014 6:22 PM IST

Sundeep-Kishan

రీసెంట్ గా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో హిట్ అందుకున్న సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గుండెల్లో గోదారి సినిమాతో విమర్శకులను మెప్పించిన కుమార్ నాగేంద్ర ప్రస్తుతం సందీప్ కిషన్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తీస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది.

ఈ సినిమాలో సందీప్ కిషన్ ముగ్గురు భామలతో ఆడిపాడుతున్నాడు. రాశి ఖన్నా, సుష్మ, ప్రియాంక బెనర్జీలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి అశోక్ బాబా నిర్మాత. ‘ఇది అన్ని వాణిజ్య అంశాలు కలగలిసి ఉన్న యాక్షన్ డ్రామా. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉందని’ ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

తాజా వార్తలు