వరుసగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పలు చేదు అనుభవాలను రుచి చూస్తోంది. వరుసగా ఇండస్ట్రీలోని చాలా మంది ప్రముఖులు చనిపోతున్నారు. తాజాగా అలనాటి నటి అంజలి దేవి గారు ఈ రోజు మధ్యాహ్నం చెన్నై లో మరణించారు. గత కొంతకాలంగా విజయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె ఈ రోజు కన్నుమూశారు.
అంజలి దేవి 1927 ఆగష్టు 24న పెద్దాపురంలో జన్మించింది. ఆమె 1936 లో ‘రాజ హరిశ్చంద్ర’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ‘గొల్లభామ’, ‘కీలు గుర్రం’, ‘స్వప్న సుందరి’, ‘చెంచు లక్ష్మి’, ‘లవ కుశ’ మొదలైన సినిమాలతో ఆమెకి స్టార్డం వచ్చింది.
అంజలి దేవి ఆమె కెరీర్ మొత్తంలో సౌత్ ఇండియాలోని అందరి హీరోలతో నటించింది. ఆమె స్వర్గస్తులైన సందర్భంగా 12తెలుగు.కామ్ తరపున ఎంతో చింతిస్తూ ఆమె కుటుంబానికి మా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాం.