ఆహ కళ్యాణం పై భారీ ఆశలు పెట్టుకున్న వాణి కపూర్

ఆహ కళ్యాణం పై భారీ ఆశలు పెట్టుకున్న వాణి కపూర్

Published on Jan 12, 2014 7:00 AM IST

vaani_kapoor
‘శుద్ దేశి రొమాన్స్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన వాణి కపూర్ ప్రస్తుతం తన రాబోవు సినిమా ‘ ఆహ కళ్యాణం’ విడుదల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ సినిమాని తమిళంలో నిర్మిస్తున్నారు. అలాగే తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేస్తున్నారు. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని, వాణి కపూర్ లు హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో జరిగిన విషయాల గురించి వాణి కపూర్ తెలియజేశారు. ‘శుద్ దేశి రోమాన్స్ సినిమా విడుదలైన తరువాత యష్ రాజ్ ఫిల్మ్స్ వారి ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ ఆహ కళ్యాణం సినిమా నా గమ్యాన్ని నిర్దారిస్తుందని అన్నారు. నాని చాలా మంచి నటుడు అలాగే మంచి మనస్తత్వం కలవాడు. ఆతనితో పనిచేయడం చాలా సులభం. అలాగే ముఖ్యంగా నాకు సెట్ లోని వారందరూ చాలా సహాయం చేశారు’. అని అంది.
ఈ సినిమాని ‘బ్యాండ్ బాజా భారత్’కి రీమేక్ గా నిర్మిస్తున్నారు. సిమ్రాన్ ఈ సినిమాలో వెడ్డింగ్ ప్లానార్ గా నటిస్తోంది. ధరన్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు