తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల చిత్రం

తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల చిత్రం

Published on Jan 4, 2012 11:50 PM IST

జనవరి 5 నుండి త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ లు చేస్తున్న చిత్రం తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు అల్లు అర్జున్ కాస్త విరామం తీసుకున్నారు. ఈ చిత్రం లో మొదటిసారి అల్లు అర్జున్ ఇలియానా తో జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా ఏ పేరు అనుకోలేదు అని చిత్ర వర్గాలు చెప్తున్నాయి. రాధా కృష్ణ, హారిక & హాసిని అనే బ్యాన్నర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా డి.వి.వి. దానయ్య సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సంవత్సరం వేసవి లో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని ఆలోచిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు