క్లైమాక్స్ దశలో ఆది నటించిన రఫ్ సినిమా

క్లైమాక్స్ దశలో ఆది నటించిన రఫ్ సినిమా

Published on Nov 21, 2013 9:00 PM IST

aadi-in-rough

‘సుకుమారుడు’ సినిమా తరువాత ‘రఫ్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ ద్వారా ఆది మన ముందుకురానున్నాడు. సుబ్బా రెడ్డి దర్శకుడు. ఆది సరసన రాకుల్ ప్రీత్ నటిస్తుంది. శ్రీ హరి ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు

ఇటీవలే ఒక పాటను హైదరాబాద్ లో తెరకెక్కించారు. ప్రస్తుతం క్లైమాక్స్ తీస్తున్నారు. పెళ్లి సెట్ లో తీస్తున్న ఈ సన్నివేశాలు అందంగా వచ్చాయని తెలిపారు. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అభిలాష్ మాధవరామ్ నిర్మాత. మణిశర్మ సంగీత దర్శకుడు. వచ్చే యేడాది సినిమా మనముందుకు రానుంది

ఈ సినిమానే కాక ఆది ‘ప్యార్ మెయిన్ పడిపోయా’ సినిమాలో నటిస్తున్నాడు. రాకుల్ తొలిసారిగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్స్’ ఈ నెల 29 న విడుదలకానుంది

తాజా వార్తలు