గత శుక్రవారం రిలీజ్ అయిన ‘గోలియోన్ క రాసలీల, రామ్ – లీల’ సినిమాని ఉత్తర ప్రదేశ్ లో నిషేదించారు. మర్యాద పురుషోత్తం భగవాన్ రామ్ లీల సమితి కోర్టులో వేసిన పిటీషన్ వల్ల అలహాబాద్ హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
ఇండియా మొత్తంగా మంచి బిజినెస్ చేస్తున్న ఈ సినిమాకి ఇది కాస్త దెబ్బనే చెప్పాలి. రన్వీర్ సింగ్, దీపిక పడుకొనే హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేసాడు. హిందువులకు బాగా సాంప్రదాయబద్దమైన ఓ పేరు పెట్టిన డైరెక్టర్ అందులో అసభ్యకరమైన సీన్స్ ని చూపించాడు.
హై కోర్టు జడ్జ్ మెంట్ లో భాగంగా ‘ మేము ఈ సినిమాకి పెట్టిన ‘రామ్ – లీల’ అనే ఒక్క టైటిల్ విషయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అది ఇండియాతో పాటు ప్రపంచంలో ఉన్న కొన్ని లక్షల మంది మనోభావాల్ని దెబ్బ తీసిందని’ తీర్పులో పేర్కొంది.