సౌత్ ఇండియన్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ 1998లో తీసిన సినిమా ‘జీన్స్’. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా చేయగా మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ జీన్స్ సినిమాకి సీక్వెల్ రానుందా? అంటే కోలీవుడ్ వర్గాలు దాదాపు అవుననే అంటున్నాయి.
ప్రశాంత్ తండ్రి అయిన త్యాగరాజన్ తాజాగా ‘జీన్స్ 2’ అనే టైటిల్ ని ఫిల్మ్ చాంబర్ లో రిజిష్టర్ చేసారు. ప్రశాంత్ హీరోగా నటించనున్న ఈ సీక్వెల్ ని త్యాగరాజన్ నిర్మించనున్నాడు. ఇప్పటికైతే ఎవరు డైరెక్ట్ చేయనున్నారు? హీరోయిన్ ఎవరు అనే వివరాలు తెలియలేదు. జీన్స్ సినిమాతో కోలీవుడ్ లో స్టార్డం తెచ్చుకున్న ప్రశాంత్ ఆ తర్వాత ఆ స్టార్డంని నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే తనకు హిట్ ఇచ్చిన సినిమా సీక్వెల్ తో విజయాన్ని అందుకొని పూర్వ వైభవాన్ని పొందాలనుకుంటున్నాడు.