ట్విట్టర్ అకౌంట్ తొలగించిన నితిన్

ట్విట్టర్ అకౌంట్ తొలగించిన నితిన్

Published on Nov 10, 2013 1:33 PM IST

nithin
యంగ్ హీరో నితిన్ ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలతో వరుస విజయాలు అందుకొని ఫుల్ జోష్ మీద ఉంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’, ‘హార్ట్ అటాక్’ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తైన ఈ రెండు సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.

ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ హీరోస్ లో నితిన్ కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన సినిమాకి సంబందించిన విశేషాలను, ఫోటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకునేవాడు. తాజాగా నితిన్ ట్విట్టర్ అకౌంట్ ని హాక్ చేసారు. దాంతో నితిన్ తన అకౌంట్ ని డెలీట్ చెయ్యడానికి నిర్ణయం తీసుకున్నాడు. కానీ త్వరలోనే మళ్ళీ వస్తానని తెలిపాడు. కొద్ది రోజుల క్రితం మంచు విష్ణు అకౌంట్ కూడా హాక్ అవ్వడంతో ఈ మధ్య ట్విట్టర్ లో కనిపించడం లేదు.

తాజా వార్తలు