మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో కొత్త హీరో సాయి ధరమ్ తేజ మొదటి చిత్రం ‘రేయ్’ 2010 అక్టోబర్ 17నా ప్రారంభమయ్యింది. దాదాపు మూడు సంవత్సరాలుగా నిర్మాణ దశలో వున్న ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. తాజా సమాచారాన్ని బట్టి ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేసి శెలవులని క్యాష్ చేయడానికి భావిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా దసరా కు విడుదల చేద్దాం అనుకున్నా కొన్ని కారణాలవలన ఆ ప్రయత్నం వాయిదా పడింది. మెగా ఫ్యామిలీ సమక్షంలో భారీ రీతిలో ఆడియో వేడుకకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు
సయామి ఖేర్ మరియు శ్రద్ధా దాస్ హీరోయిన్స్. చక్రి సంగీత దర్శకుడు. వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వం వహించడమే కాక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు