ఎన్.టి.ఆర్ తో జోడీకట్టనున్న ప్రణీత

ఎన్.టి.ఆర్ తో జోడీకట్టనున్న ప్రణీత

Published on Oct 27, 2013 4:00 AM IST

Pranitha-to-team-up-with-NT

‘ఏం పిల్లో ఏం పిల్లాడో’చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించిన ప్రణీత ఆ చిత్రమే కాక ఆ తరువాత తాను నటించిన సినిమాలు ఆమెను నిరాశకు గురిచేశాయి

అయితే ‘అత్తారింటికి దారేది’ సినిమా విజయం సాధించడంతో ఆమెకు అవకాశాలు వెల్లివిరుస్తున్నాయి. అయితే ఈ భామ సినిమాల ఎంపికలో జాగ్రత్త వహిస్తుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ సరసన రెండో కధానాయికగా నటిస్తుంది. ప్రస్తుతానికి ‘రభస’ అనే టైటిల్ తో సాగుతున్న ఈ సినిమాలో కూడా సమంతానే హీరోయిన్ కావడం కొసమెరుపు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటిలో జరుగుతుంది

‘కందిరీగ’తో విజయాన్ని పలకరించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు. బెల్లంకొండ గణేశ్ బాబు నిర్మాత. ఈ సినిమాను శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్ బ్యానర్ పై విడుదల చేయనున్నారు

తాజా వార్తలు