కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసిన అల్లు అర్జున్

కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసిన అల్లు అర్జున్

Published on Oct 27, 2013 3:39 AM IST

Allu-Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు యూత్ అభిమానులు ఎక్కువ. ప్రతీ సినిమాలోనూ ఒక వైవిధ్యమైన గెట్ అప్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాని ద్వారానే అతను అభిమానులను సంపాదించుకున్నాడు

అల్లు అర్జున్ కు ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా ఫేస్ బుక్ ద్వారా అభిమానులకు ఫోటోలు వార్తలు అందిస్తువుంటాడు. అతని సినిమాల విషయమే కాకుండా వ్యక్తిగత విషయాలు కూడా తెలుపుతాడు. అల్లు అర్జున్ పేస్ బుక్ అకౌంట్ కు ఒక మిలియన్ లైకులు వచ్చాయి. అది మరే తెలుగు హీరో సాధించని రికార్డు.

ప్రస్తుతం ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది

తాజా వార్తలు