‘అవును’ సినిమాతో విజయం రుచి చుసిన హర్షవర్ధన్ రానే ఇప్పుడు ‘ప్రేమ ఇష్క్ కాదల్’ అనే సినిమాతో ఒక ప్రధానపాత్ర పోషించి మనముందుకు రానున్నాడు. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా సాగనుంది
హర్షవర్దన్, విష్ణు మరియు హరీష్ లు ప్రధాన పాత్రలలో వారి జంటల నడుమ సాగే ప్రేమకధగా చిత్రం నిలవనుంది. హీరోయిన్స్ గా రీతు వర్మ, వ్రితిక మరియు శ్రీముఖి నటిస్తున్నారు. ఈ నెల 24న ఆడియో మధుర ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మార్కెట్ లోకి విడుదలకానుంది. పవన్ సాధినేని దర్శకుడిగా పరిచయంకానున్నాడు. బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను లక్కీ మీడియా ద్వారా విడుదల చేయ్యనున్నారు. త్వరలోనే విడుదల తేదిని తెలుపుతారు