హైదరాబాద్ లో రుద్రమదేవి విన్యాసాలు

హైదరాబాద్ లో రుద్రమదేవి విన్యాసాలు

Published on Oct 19, 2013 10:02 AM IST

Rudrama-Devi

మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు అనుష్క మొదటి ఎంపికగా నిలిచింది. అందుకే గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి’ అనే భారీ బడ్జెట్ సినిమాలో అనుష్కను కధానాయికగా తీసుకోవడానికి ఏమాత్రం ఆలోచించలేదు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతుంది.

ఈ సినిమాకోసం భారీ రీతిలో సెట్లను అన్నపూర్ణ స్టూడియోస్ లో వేశారు. సమాచారం ప్రకారం ఈ సెట్లు అద్భుతంగా వచ్చి, నయనానందకరంగా వుంటాయట. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ “ప్రపంచ చరిత్రలో రాణి రుద్రమదేవి గారి ప్రస్థానం ప్రత్యేకం. ఈతరం ప్రజలకు ఆవిడ చరిత్రను తెలియజెప్పాలనికధలో ఎటువంటి మార్పులూ చెయ్యట్లేదు. సాంకేతికంగా ఉన్నత విలువలతో ఈ సినిమాను తెరకేక్క్సితున్నాం ” అని తెలిపాడు

రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో విభిన్నమైన తారాగణం చోటు సంపాదించుకున్నారు. ఇళయరాజ సంగీత దర్శకుడు. తెలుగు మరియు తమిళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వం వహించడమేకాక నిర్మించడం కూడా విశేషం

తాజా వార్తలు