కష్టాల్లో వున్న నిర్మాత ఏ.ఎం రత్నం

కష్టాల్లో వున్న నిర్మాత ఏ.ఎం రత్నం

Published on Oct 19, 2013 3:45 AM IST

amratnam
తమిళంలో పలు సూపర్ హిట్ లను నిర్మించి, భారీ బడ్జెట్ సినిమాల దర్శకుడు శంకర్ దాదాపు చాలా సినిమాలను నిర్మించిన ఏ.ఎం రత్నం ఇటీవల తీసిన సినిమాలు పరాజయం పాలై ఆర్ధికంగా నష్టాలలో వున్నాడు

చెన్నైలో వుండే కిషన్ అంటే ఫైనాన్సియర్ ఏ.ఎం రత్నం తనకు బకాయి వున్నాడని కోర్టులో కేసు వేసాడు. కిషన్ వాదన ప్రకారం అతని తల్లి రత్నం కు 1.50 కోట్లను ‘కల్లన్’ సినిమాను నిర్మించడం కోసం అప్పుగా ఇచ్చిందట. ఈ డబ్బుని సినిమా విడుదలకు ముందే (జనవరి 2006) 18శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలట. అయతే రత్నం అసలు అసలూ, వడ్డీ రెండూ కట్టలేదట

వీరిద్దరూ కలిసి మరో సినిమాలో పెట్టుబడిపెట్టారు. ఈ సినిమా కోసం సంవత్సరానికి 36శాతం వడ్డీ ఇస్తానని రత్నం తెలిపాడు. ఇప్పుడు కిషన్ పాత డబ్బులతో కలిపి రత్నం తనకు 4.60 కోట్లు ఇవ్వాలని వాదిస్తున్నాడు. చూద్దాం ఇది ఎక్కడి వరకూ వెళ్తుందో

తాజా వార్తలు