భోజ్ పురి ఇండస్ట్రీలో రవి కిషన్ అందరికీ సుపరుచితుడే. ఆయన ఇప్పుడు ‘రేస్ గుర్రం’ సినిమా ద్వారా టాలీవుడ్ లో విలన్ గా పరిచయంకానున్నాడు. ఇందులో ఆయన ఒక రాజకీయనాయకుని పాత్ర పోషిస్తున్నాడు.
రవి కిషన్ కు టాలీవుడ్ కు చాలా నచ్చేసిందట. “ఇక్కడ ప్రతీ నటుడ్ని ప్రేమించడం, గౌరవం ఇస్తుంటారు నాకు ఇక్కడ పనిచెయ్యడం ఇష్టం” అని చెప్పాడు. అంతేకాక తను నటిస్తున్న ‘రేస్ గుర్రం’ పై చాలా ఉత్సాహంగా వున్నాడు. “నేను టాలీవుడ్ లో ఒక మంచి సినిమాతో ఆరంగ్రేటం చేద్దామనుకున్నాను. ‘రేస్ గుర్రం’ నా ఊహలకు సరిగ్గా సరిపోయే సినిమా. నేను సరైన ట్రాక్ లో వున్నా అని అనుకుంటున్నాను” అని తెలిపాడు
అంతేకాక ఈ భోజ్ పురి నటుడు ఈ సినిమాలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొనున్నాడు. “నాకు తెలుగు అలవాటు పడటానికి వారంపట్టింది” అని చెప్పాడు. రవి కిషన్ కు టాలీవుడ్ కు స్వాగతం