చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకప్పటి లాగా కథని నమ్ముకొని వచ్చే సినిమాలు తక్కువైపోయాయి. అలాంటి కథలను నమ్ముకొని సినిమాలు తీసే నిర్మాతలు తక్కువైపోయారు. దాంతో ఎక్కువభాగం దర్శకులంతా కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంపై ‘అలా మొదలైంది’ ఫేం నందిని రెడ్డి తమ ఆవేదనని వ్యక్తం చేసింది.
సుమంత్ అశ్విన్, ఈశలను హీరో హీరోయిన్స్ గా తీసుకొని మోహనకృష్ణ ఇంద్రగంటి తీసిన సినిమా ‘అంతక ముందు ఆ తరువాత’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 50 రోజుల వేడుకకి హాజరైన నందిని రెడ్డి మాట్లాడుతూ ‘ స్టార్ హీరోతో పనిలేకుండా కేవలం కథని నమ్ముకొని సినిమాలు తీసే నిర్మాతలు చాలా తక్కువగా ఉన్నారు. అందులో దాముగారు ఒకరు. తమిళంలో కోటి, కోటిన్నర బడ్జెట్ తో తీసిన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాల్ని అందుకుంటున్నాయి. ఇక్కడ మాత్రం ఎందుకు అలాంటి సినిమాలు రావట్లేదు. దాము గారు మాత్రం ఆమంచి అభిరుచిగల నిర్మాత. మీ దగ్గర మంచి కథ ఉంటె డైరెక్ట్ గా వెళ్లి దాము గారిని కలవండి. కలిసి సినిమా చేయండని’ ఆమె అన్నారు.