50 రోజుల మార్క్ క్రాస్ చేసిన అంతక ముందు ఆ తరువాత

50 రోజుల మార్క్ క్రాస్ చేసిన అంతక ముందు ఆ తరువాత

Published on Oct 16, 2013 7:00 PM IST

AMAT_Release_Date

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అంతక ముందు ఆ తరువాత’ సినిమా 50 రోజుల ల్యాండ్ మార్క్ ని క్రాస్ చేసింది. ఈ సినిమా విమర్శకులను మెప్పించడమే కాకుండా, బాక్స్ ఆఫీసు వద్ద మంచి లాభాలను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత 50 రోజుల వేడుకని ఏర్పాటు చేసారు. ఈ చిత్ర నటీనటులు, టెక్నికల్ టీం అందరూ ఈ వేడుకకి హాజరయ్యారు.

సుమంత్ అశ్విన్ – ఈశ జంటగా నటించిన ఈ సినిమాకి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు. ఈ వేడుకకి హీరో సునీల్, స్వాతి, ఎంఎస్ రాజు, బి. గోపాల్, భీమనేని శ్రీనివాసరావు, నందిని రెడ్డి, మారుతీ, ఎస్. గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ అవసరాల, డాన్స్ మాస్టర్ తార తదితరులు హాజరయ్యారు.

నిర్మాత దాము సినిమాని ఇంత మంచి హిట్ చేసినందుకు ప్రేక్షకులకు తన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయన డైరెక్టర్ మరియు నటీనటులను కూడా వారి ప్రతిభ విషయంలో వారిని మెచ్చుకున్నారు. అంటక ముందు ఆ తరువాత సినిమాలో పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఇద్దరి లైఫ్ లో ఉండే రిలేషన్ షిప్ గురించి చూపించారు.

తాజా వార్తలు