ప్రారంభమైన బాహుబలి మూడో షెడ్యూల్

ప్రారంభమైన బాహుబలి మూడో షెడ్యూల్

Published on Oct 15, 2013 7:30 PM IST

Bahubali
భవిష్యత్తులో విడుదల కానున్న తెలుగు చిత్రాలలో ‘బాహుబలి’ సినిమాపై వున్న అంచనాలను మరే సినిమా అందుకోలేదేమో. ఇంతలా అంచనాలు పెరగడానికి ఈ సినిమాలో చాలానే అంశాలు వున్నాయి. దర్శకుడు జక్కన్న రాజమౌళి ఈ సినిమాలోని ప్రతీ చిన్న అంశంపైనా చాలా శ్రద్ధ తీసుకుని మన ఊహలకు అందని విధంలో తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా రోజులవరకూ సాగినా ప్రస్తుతం షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. కర్నూల్ రాక్ గార్డెన్స్ లో మొదటి షెడ్యూల్ ను, ప్రధాన తారాగణం నడుమ రామోజీ ఫిలింసిటీలో రెండో షెడ్యూల్ ను ముగించుకున్న ఈ సినిమా అక్కడే ముఖ్య సన్నివేశాల మేళనగా మూడో షెడ్యూల్ ని కుడా చిత్రీకరించనున్నారు.

తాను అనుకున్న దానికంటే రెండు రోజులు ముందే ఈ సినిమా రెండో షెడ్యూల్ ముగిసింది అని రాజమౌళి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్, రానా మరియు అనుష్క ముఖ్య పాత్రధారులు. కీరవాణి బాణీలను అందిస్తున్నాడు. టాలీవుడ్ చరిత్రలోనే ఘనంగా తీస్తున్న ఈ సినిమాను సోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు